EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రూ.50.73 కోట్లతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్19 ;

రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి రూ.50.73 కోట్లతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . శ్రీకారం చుట్టారు.రూ.36.65 కోట్లతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సీఎం .రూ.14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలలో బాల బాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను ప్రారంభించిన సీఎం

శంకుస్థాపనల వివరాలు:

రూ.10 కోట్లతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం

రూ.10 కోట్లతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డా.,బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ

రూ.4 కోట్లతో నారాయణపేట్ జిల్లా నర్వ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం

రూ.4 కోట్లతో వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో మల్టీ పర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్ట్స్ నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి.

రూ.3.50 కోట్లతో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం

రూ.2.65 కోట్లతో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం

రూ.2.50 కోట్లతో నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో వాలీబాల్ & కబడ్డీ కోర్ట్స్ నిర్మాణం.

ప్రారంభోత్సవాల వివరాలు:

రూ.5.70 కోట్లతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీ ప్రారంభం

రూ.5.70 కోట్లతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీ ప్రారంభం

రూ.35.95 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ ప్రారంభం

రూ.35.94 లక్షలతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ ప్రారంభం

రూ.44.50 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ ప్రారంభం

రూ.44.50 లక్షలతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ ప్రారంభం

రూ.58.50 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫుట్ బాల్ అకాడమీ ప్రారంభం

రూ.49 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ బాల్ అకాడమీ ప్రారంభం

Related News

Select the Topic
Scroll to Top