EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఒంగోలులో….  కదం తొక్కిన పొగాకు రైతులు – పొగాకు గిట్టుబాటు ధరలకై భారీగా ట్రాక్టర్ నిరసన ర్యాలీ 

ఈతరం భారతం అమరావతి జూన్ 19

పొగాకు గిట్టుబాటు ధర పై రైతులు గర్జించారు, వందలాది ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేపట్టారు, వేలాదిమంది రైతులు రోడ్లమీద కు తరలివచ్చారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందటం కార్పొరేట్ కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దగా చేయటంపై రైతులు గత రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ… రాలిని అగ్రభాగ నుండి ముందుకు నడిపించారు.

ఒంగోలులోని స్థానిక మినీ స్టేడియం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హాజరై మాట్లాడుతూ పొగాకు కొనుగోలు కంపెనీల సిండికేట్ రాజకీయం, పొగాకు బొర్డు అలసత్వం వల్ల తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్న మన వర్జీనియా పొగాకు రైతులకు ప్రస్తుత 2025- 26 సీజన్ లో కనీస పెట్టుబడులు, ఖర్చులు కూడా లభించడం లేదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వల్ల రైతులు వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాలతో కనీస సంప్రదింపులు లేకుండా పొగాకు పై 28% నుండి 40% పన్ను లు వేయడం వల్లనే నేటి ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు. సరాసరిన పొగాకు రైతుకు బ్యారెన్ కు రూ. ఐదు నుండి ఏడు లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టుకోలేని దుస్థితిలో నేడు రైతాంగం ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు కొనుగోలుకు రూ. 1000 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల బలవర్మణాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50,000 పొగాకు రైతులు కుటుంబాలు పొగాకు గిట్టుబాటు ధర కోసం నేడు రోడ్డెక్కుతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు రూ. 16 లక్షల 50 వేల కోట్లు అప్పులు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం పొగాకు రైతుల కోసం కనీసం 1000 కోట్లు కూడా కేటాయించలేదా అని ప్రశ్నించారు. పొగాకు ఇగుమూతల ద్వారా కేంద్ర ప్రభుత్వానికిరూ. 60 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 22 వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నప్పటికీ రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన ముఖ్యమంత్రి సమావేశంలో చంద్రబాబు నాయుడు కిలో పొగాకు ను రూ. 200కు తగ్గకుండా కొనుగోలు చేయిస్తామని పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం కిలోకు రూ. 250 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొగాకు చివరి ఆకు వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే మంత్రులు పొగాకు కొనుగోలు వ్యవహారంపై కేంద్రంతో నిర్వహించే చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా ను, పొగాకు రైతులను భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, నాయకులు జీవి కొండారెడ్డి, శ్రీకాంత్, మస్తాన్, రాజశేఖర్, కోటేశ్వరరావు,ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వడ్డే హనుమారెడ్డి, కే వీరారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జయంతి బాబు, పమిడి వెంకట్రావు, ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు లలిత కుమారి, కోడూరి నాంచార్లు, సిపిఐ జిల్లా నాయకులు ఆర్ రామకృష్ణ, లక్ష్మి, ఎం విజయ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top