ఈ తరం భారతం హైదరాబాద్ జూన్ 23
హైదరాబాద్ మిమిక్రీ మ్యాజిక్ మైమ్ సప్తాహం లో ఖమ్మం మిమిక్రీ కళాకారుడు అయిత రాజ్ కుమార్ ప్రత్యేకమైన వివిధ ప్రముఖుల స్వరాలతో అలరించారు.మిమిక్రీ కేవలం వినోదం కాదు. వ్యక్తిత్వ వికాసానికి,సామాజిక చైతన్యానికి వేదిక.మనుషుల ముఖాల్లో చిరునవ్వులు పూయించడం ఒక కళ అయితే,ఆ నవ్వుల్లో సందేశాన్ని జోడించి సమాజాన్ని ఆలోచింపజేయడమే మిమిక్రీ కళాకారుల ప్రత్యేకత. అనుకరణ కళ ద్వారా వ్యక్తులను ఆకట్టుకోవడమే కాకుండా, ఆలోచనా విధానాన్నినటుడు,మాజీ మంత్రి బాబు మోహన్ సమక్షంలో తనదైన శైలిలో అనుకరించి సభలో నవ్వుల జల్లు కురిపించారు. ప్రేక్షకుల చప్పట్లతో అభినందించగా,బాబు మోహన్ స్వయంగా అయిత రాజ్ కుమార్ ప్రతిభను కొనియాడడం విశేషంగా నిలిచింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబు మోహన్ మాట్లాడుతూ మిమిక్రీ కళాకారులు సమాజానికి ఆనందాన్ని పంచే సృజనాత్మక శక్తులని అభివర్ణించారు. ఒక మంచి మిమిక్రీ కళాకారుడు కేవలం స్వరాలను మాత్రమే కాదు, మనుషుల భావోద్వేగాలను కూడా ప్రతిబింబించగలడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా కళా జనార్దన మూర్తి, మద్దాలి రఘురాం,నేరెళ్ల శ్రీనాథ్, అలాగే కళా రత్న మల్లం రమేష్ ,3M ఫెస్టివల్ కళాకారులను పాల్గొని అభినందించారు.కార్యక్రమ సమన్వయకర్తగా ప్రముఖ మిమిక్రీ కళాకారుడు మల్లం రమేష్ వ్యవహరించగా,మెజీషియన్ రామడుగు వసంత్,భవిరి శివ తదితరులు హాజరయ్యారు. కళాకారుల ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తూ, మిమిక్రీ వంటి సృజనాత్మక కళలకు వేదికలు కల్పించడం ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా పెంచవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని కల్పించిన సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్,మెజీషియన్ మల్లం రమేష్ కు మిమిక్రీ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.మిమిక్రీ అనేది కేవలం అనుకరణ కాదు. నవ్వులతో మనసులను గెలుచుకుని,సందేశాలతో సమాజాన్ని మార్చగల సజీవ కళా అని కార్యక్రమంలో పలువురు కళాభిమానులు వ్యాఖ్యానించారు.
సానుకూల దిశగా మలిచే శక్తి మిమిక్రీకి ఉందని మరోసారి రుజువైంది. శ్రీ త్యాగరాయ గాన సభ, ఆనందలహరి, హైదరాబాద్ మెజీషియన్స్,భవిరి ఆర్ట్స్, మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గాన సభ సంగీత నాట్య కళా వేదికపై ఘనంగా నిర్వహించిన మిమిక్రీమ్యాజిక్మైమ్ సప్తాహం ఫెస్టివల్ కళాభిమానులను విశేషంగా అలరించింది. ఈ ప్రతిష్టాత్మక ఉత్సవంలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ మిమిక్రీ కళాకారుడు, స్టేజ్ యాంకర్ మిమిక్రీ రాజ్ కుమార్ తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.















