EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నీట్‌ని రద్దు చేయాలి.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన డిమాండ్

ఈతరంభారతం చెన్నై జూన్ 23

నీట్‌‌తో విద్యార్థుల మధ్య అసమానతలు పెరుగుతున్నాయని, ఈ పరీక్షను రద్దు చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసఫ్ విజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన నీట్‌ వ్యవస్థపై మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య సీట్లు కేటాయించాలని కోరుతుందని గుర్తు చేశారు. అదేవిధంగా హిందీని కూడా తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేయొద్దని విజయ్ చెప్పారు. తమకు తమిళం, ఇంగ్లిష్ చాలు అని స్పష్టం చేశారు.తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

కొన్నేళ్లుగా నీట్ పరీక్షపై వివాదాలు కొనసాగుతున్నాయని.. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం విద్యార్థులను మానసికంగా కృంగదీస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య సీట్లు కేటాయించాలని కోరుతుందని ఈ సందర్భంగా మరోసారి విజయ్ కేంద్రానికి సూచన చేశారు.తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను కూడా సీఎం విజయ్ వ్యతిరేకించారు. తమిళం, ఇంగ్లిష్‌తో కూడిన రెండు భాషల విధానానికే తాము కట్టుబడి ఉంటామని, తమ ప్రాంతానికి అది సరిపోతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా తనపై విమర్శలు చేస్తున్న వారికి అసెంబ్లీలోనే ఘాటుగా సమాధానమిచ్చారు. తమిళగ వెట్రి కళగం పార్టీను ఇప్పటికీ ఓ నటుడి పార్టీగా ఎద్దేవా చేస్తున్న వారిపై సీఎం ఎదురుదాడి చేశారు. తాము ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వచ్చామని, తమ పార్టీకి 35 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.

“మేము చాలా కష్టాలు, కుట్రలు, ఆంక్షలు ఎదుర్కొని ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాం. కొందరు ఇప్పటికీ అతను కేవలం నటుడు, అది నటుడి పార్టీ అని విమర్శిస్తున్నారు. అలాంటి విమర్శలను మేము పట్టించుకోము. మా రాజకీయాలు పారదర్శకంగా ఉంటాయి. మేమేమీ సులభంగా అధికారంలోకి రాలేదు” అని విజయ్ అన్నారు.1967లో అన్నాదురై, 1977లో ఎంజీఆర్ ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని విజయ్ గుర్తు చేశారు. అదేవిధంగా 2026లో తాము కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. తమ రాజకీయాలు ఒక కుటుంబం కోసం కాదని, తమిళనాడులోని ప్రతి కుటుంబం కోసమంటూ పరోక్షంగా డీఎంకేపై విమర్శలు గుప్పించారు.

Related News

Select the Topic
Scroll to Top