ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 23 ;
మిలిటరీ సైనికులకు ఉన్నంత క్రమశిక్షణ క్రీడాకారులకు ఖచ్చితంగా ఉండాలని క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులే అంతిమంగా విజయం సాధిస్తారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనిర్వహించిన ఒలంపిక్ డే రన్ 2026 లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు పాల్గొన్నారు.నగరంలోని ఎల్ బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో ఒలంపిక్ స్ఫూర్తిని నింపేలా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఒలంపిక్ డే రన్ అనేది కేవలం క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి కోశాధికారి సతీష్ గౌడ్, ప్రవీణ్ శోభన్ మనోహర్ ప్రతాప్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు అనిత,రవీందర్, శ్రీనివాస్ పి ఆర్ ఓ కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు















