ఈతరం భారతం రంగారెడ్డి జిల్లా జూన్ 25:
డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షేర్గూడ గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఘనంగానిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందారు.ఈ శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి పరీక్షలు, దంత పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సలహా మేరకు అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేలా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, ఫార్మసీ విద్యార్థులు మరియు వాలంటీర్లు సేవలందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను వివిధ ప్రాంతాల్లో నిరంతరం నిర్వహిస్తోందని సొసైటీ ఎక్స్ గ్యుటీ మెంబర్ జి.మాధవి తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య బృందం, వాలంటీర్లు మరియు గ్రామ ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.















