EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్యతో మెరుగైన  ఉన్నత విద్యా అవకాశాలు 

ఈతరం భారతం హైదరాబాద్: జూన్ 28

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆ యూనివర్సిటీ ఎస్ఎస్ బి డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ ను ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న డిగ్రీ పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం అందించే బిఏ, బీకాం,బీఎస్సీ కోర్సులలో చేరవచ్చని తెలిపారు. అది తక్కువ ఫీజుతో నాణ్యమైన, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే కోర్సులను అంబేద్కర్ యూనివర్సిటీ అందిస్తున్నదని ఆయన చెప్పారు. ఆగస్టు 7వ తేదీ లోపు డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చని ఆయన తెలిపారు. మహిళా అభ్యర్థులు బేగంపేటలోని మహిళా డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రాన్ని సంప్రదించి యూజీ, పీజీ కోర్సుల సమాచారం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.యూనివర్సిటీ అందించే డిగ్రీ, పీజీ కోర్సులలో చేరగోరే ఔత్సాహిక విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ను సంబంధిత ప్రాంతంలోని స్టడీ సెంటర్ ను కానీ సంప్రదించి పూర్తి వివరాలను పొందవచ్చని ఆయన చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులంతా అంబేద్కర్ యూనివర్సిటీ కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Related News

Select the Topic
Scroll to Top