ఈతరం భారతం హైదరాబాద్, (సైదాబాద్) జులై 5:
డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సైదాబాద్‌లోని ఆనంద మార్గ స్కూల్ ఆశ్రమంలో ఉచిత దంత వైద్య మరియు నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులకు దంత పరీక్షలు, నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు మరియు ఆరోగ్య అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా నిపుణులైన వైద్యులు తమ సేవలను అందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి తదుపరి చికిత్స కోసం సూచనలు అందించారు.
ఈ సందర్బంగా సొసైటీ ఎక్సగ్యుటీ మెంబెర్ జి.మాధవి మాట్లాడుతూ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ఆనంద మార్గ స్కూల్ ఆశ్రమం,యాజమాన్యానికి, వైద్య బృందానికి, వాలంటీర్లకు మరియు సేవా కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.”ప్రతి చిన్నారి ఆరోగ్యమే మన సమాజ భవిష్యత్తు” అనే సంకల్పంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.















