EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అమలు విషయం లో.. హైకోర్టు తీర్పు హర్ష నీయం

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 6 :

ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అమలు విషయం లో.. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యకకస్తున్నట్టు ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ తెలిపారు.సోమవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల కొందరు అధికారులు ఏక పక్షం గా వ్యవహరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దం అని ఉన్నత ధర్మాసనం స్పష్టం చేయడం ఎంతో మంది ఉద్యోగులకు విషయం పట్ల అవగాహన వచ్చేలా చేసిందన్నారు.కొందరు ఉన్నతాధికారులు ఉద్యోగుల పట్ల తమ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగుల సర్వీస్ లో రిమార్క్ వచ్చే అవకాశం ఉండటమే గాక..వారు పని చేసే ఆయా కార్యాలయాలలో తోటి సిబ్బంది తో పాటు ఇతర అధికారులు చులకన భావం తో..వ్యవహరించే అవకాశం ఉందని రఘునందన్ వివరించారు. ఓ ఉద్యోగి పై చర్య తీసుకునే ముందు..మెమో ,ఆ తర్వాత షో కాజ్ నోటీసు ఇచ్చే నియమ నిబంధన ఉందన్నారు. ఈ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా..ఉన్నతాధికారులు తమ ఈగో కు ఉద్యోగులను బలి చేయడం సముచితం కాదని రఘునందన్ అభిప్రాయపడ్డారు. తనకు అన్యాయం జరిగింది అని ఉద్యోగులు కోర్టు ను ఆశ్రయించేలా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా అవకాశం కల్పిస్తున్నది కొందరు ఉన్నతాధికారుల మితిమీరిన ఈగో నే అని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.అంతా మా ఇష్టం.మేం చేసేదే కరెక్ట్ అన్న చందాన ఆలోచించడం..ఆ మేరకు వ్యవహరించడం అటు అధికారులు,ఇటు ఉన్నతాధికారులు తమ విచక్షణ తో.. ఒక్క మారు ఆలోచించుకోవాలని రఘునందన్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం ప్రార్ధన చేసే పరిస్థితి రాకూడదని.రఘునందన్ ఆశా భావం వ్యక్తం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top