ఈతరం భారతం హైదరాబాద్ జూలై 6
తెలంగాణ కు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. మరో మూడు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కేవలం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో జిల్లాల ప్రజలు ఫ్లైట్ జర్నీ కోసం ఎక్కడికి వెళ్లాలన్నా హైదరాబాద్ రావాల్సి వస్తోంది. కానీ ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి.తెలంగాణలో ఏవియేషన్ రంగాన్ని భారీగా విస్తరిస్తూ మరో మూడు కొత్త విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లో జరిగిన ఏరోమార్ట్ 2026 సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ గుడ్‌న్యూస్ చెప్పారు.















