ఈతరం భారతం ఖమ్మం, 9 జులై (నలుబోల మధుశ్రీ 🙂
ఈ నెల 11,12 తేదీలలో విజయవాడ కె బి ఎన్ కళాశాల లో మూడవ ప్రపంచ తెలుగు రచయిత్రుల మహాసభ లు రెండు రోజుల పాటు కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సభలలో ఖమ్మం వికాస వేదిక సాహిత్య సంస్థ కు అత్యంత ప్రాధాన్యత కల్పించడం విశేషం. ఈ సభలకు కార్యనిర్వాహాక కమిటీ లో వికాస వేదిక సాహిత్య సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ ను కార్యదర్శి గా, కవిసమ్మేళనం సభావేదిక కు కన్వీనర్ గా ఎన్నిక చేయగా సంస్థ జిల్లా కార్యదర్శి తిరునగరి శ్రీనివాస రావు, ఎన్. మధు శ్రీ, యడవల్లి శైలజ, చింతమళ్ళ సునీత, సంస్థ యువత విభాగం అధ్యక్షులు గుడిసె రాజశేఖర్ లు నిర్వహణ భాద్యతలు నిర్వహించడం జరుగుతుంది.ఈ సభలు వర్ధమాన కవులకు, బాలకవులకు విజ్ఞానవంతంగా ఉంటూ, గొప్ప వారిని కలుసుకొని అనుభవాలను పంచుకునే అవకాశం అనుభూతి కలుగుతుంది.















