ఈతరం భారతం హైద్రాబాద్ జులై 10:
బీసీ విద్యార్థులు – బీసీ ప్రజల డిమాండ్లపై నేడు సచివాలయంలో నేడు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు తో బీసీ నేతలు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బి.సి సంఘ నాయకులూ చర్చలు జరిపారు. ఈ క్రింది డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయలు 8వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, కాలేజీ హాస్టల్ సీట్లు దొరకక చాలామంది విద్యార్థులు చదువు మానుకుంటున్నారు. అదనంగా 120 బీసీ కాలేజీ హాస్టళ్ళు, 30 ఎస్టి కాలేజీ హాస్టళ్ళు మంజూరు, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న హాస్టళ్ళలలో 20 శాతం సీట్లు పెంచాలని కోరారు.150 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో మంజూరు చేయాలి. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో 99 శాతం రిజల్ట్ రావడంతో డిమాండ్ బాగా ఉన్నందున అదనంగా 10 శాతం సీట్లు పెంచాలని,బిసి కార్పొరేషన్ ద్వారా రెగ్యులర్ గా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.ఉద్యోగాల భర్తీకే అమలు చేస్తున్న రోస్టర్ విధానం బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉంది. దీనిపై సమీక్ష చేసి మార్చాలి.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30వేల టీచర్ పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేయాలని,రాష్ట్రంలో ఖాలీగా యున్న గ్రూప్ 1 1600 పోస్టులు, గ్రూప్ 2లో 3వేల పోస్టులు గ్రూప్ 4 లో 10వేల పోస్టులు భర్తీ చేయాలనీ కోరారు.కాగాన్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు హామీ ఇచ్చారు.
ఈ చర్చలలో రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం పగిళ్ళ సతీష్, రాష్ట బి.సి సంఘం సి. రాజేందర్, రాష్ట బి.సి విద్యార్ధి సంఘం కన్వీనర్ మోడీ రాందేవ్, రాష్ట్ర బి.సి ప్రజా సమితి అధ్యక్షులు భీంరాజు, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.















