ఈతరం భారతం హైద్రాబాద్ జులై 10;
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నిజమైన తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం, గుర్తింపు మరియు సంక్షేమ చర్యలుకల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ప్రొఫెసర్ ఎం. కోదండరాం ను తెలంగాణఉద్యమకారుల కమిటీ చెర్మెన్ బండి రమేష్ కలిసి వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ ఉద్యమం కారులకు 250 చదరపు గజాల నివాస స్థలం కేటాయించాలని, నెలకు ₹25,000 పింఛను ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని,తెలంగాణఉద్యమకారుల గుర్తింపు కార్డుల జారీ చేయాలని,ప్రత్యేక బడ్జెట్తో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,
ఉచిత బస్ పాస్, హెల్త్ కార్డ్ మరియు బీమా సౌకర్యాలు కల్పించాలని, ఉస్మానియా విశ్వవిద్యాలయం/సికింద్రాబాద్ సమీపంలో అమరవీరుల స్థూపం నిర్మించాలని,
అమరవీరుల కుటుంబాలకు, గాయపడిన కార్యకర్తలకు, జైలులో ఉన్న కార్యకర్తలకు మరియు క్షేత్రస్థాయి తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపునిస్తూ, గుర్తింపు ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలని కోరారు.అలాగేతెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను, సేవలను గౌరవించేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకోవాలని కోరారు.















