EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ముంగనూరు ప్రభుత్వ భూములను పరిరక్షించాలి :రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ వినతి

ఈతరం భారతం రంగారెడ్డి జులై 22;

రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయమజల్ మున్సిపాలిటీ పరిధిలోని ముంగనూరు గ్రామంలో ప్రభుత్వ భూముల అక్రమ మార్పిడి, రికార్డులలో అక్రమ మార్పులు, నిషేధిత జాబితా నుంచి తొలగింపు, ప్రైవేటు వ్యక్తుల పేర్లపై నమోదులు జరిగినట్లు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్లు (EC), ధరణి/భూ భారతి వివరాలు మరియు పత్రికా కథనాల ఆధారంగా తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించి, ముంగనూరు గ్రామంలోని సర్వే నంబర్లు 44/2, 44/4, 44/5 మరియు వాటి సబ్‌డివిజన్లు (44/6, 44/8, 44/9, 44/10, 44/11)లో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ భూములపై జరిగిన పాస్‌బుక్ సవరణలు, రీ-నంబరింగ్, NALA మార్పిడులు, రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ చేపట్టాలని,అక్రమంగా జరిగిన పట్టాలు, రిజిస్ట్రేషన్లు, NALA అనుమతులను రద్దు చేయాలని,సంబంధిత భూములను తిరిగి నిషేధిత (Prohibited) జాబితాలో చేర్చి ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని,బాధ్యులైన రెవెన్యూ అధికారులు, ఇతర సంబంధిత అధికారులపై శాఖాపరమైన మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని,విచారణ పూర్తయ్యే వరకు ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు, అభివృద్ధి పనులు, మూడో వ్యక్తికి హక్కుల బదిలీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడకూడదని, ప్రజల ఆస్తులను కాపాడేందుకు పారదర్శక విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని డా. బూర నర్సయ్య గౌడ్ జిల్లా కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎలిమినేటి నర్సింహా రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ యాదవ్ బోసుపల్లీ ప్రతాప్ , కొత్త రాంరెడ్డి గారు, బచ్చుగళ్ళ రమేష్ , కొండ్రు పురుషోత్తం, లక్ష్మీపతి గారు, అశోక్ గారు , గణేశ్ గౌడ్ , శ్రీదేవి జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

Related News

Select the Topic
Scroll to Top