ఈతరం భారతం హైదరాబాద్ జూలై 24
తెలంగాణ : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసే డిమాండ్‌పై ఉత్కంఠ వీడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఒక ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మూడో వారానికి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబరు 9న ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సమ్మె సందర్భంగా ఉద్యోగులు కోరిన చాలా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చింది. మిగిలిన ఉద్యోగుల విలీనం, గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణకు లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.















