EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గాయకుడు దేవత సుధాకర్ కు    సినారె కళారత్న పురస్కారం -2026 ప్రదానం

ఈతరం భారతం హైదరాబాద్, జూలై 28 :

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి 95 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యువ ఆర్ట్స్ థియేటర్స్ హైదరాబాద్ త్యాగరాయ గానసభలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ గాయకులు, గీత రచయిత దేవత సుధాకర్ కు సినారె కళారత్న -2026 పురస్కారాన్ని ప్రధానం చేశారు . హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక భాషా సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సుధాకర్ స్వీకరించారు. పురస్కారం అందుకున్న సుధాకర్ ను కార్యక్రమ అతిధులు, సంస్థ నిర్వాహకులు, పలువురు సాంస్కృతిక రంగ ప్రతినిధులు అభినందించారు.

Related News

Select the Topic
Scroll to Top