EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డా. తిరునగరి శ్రీనివాస్ కు   సినారె కళారత్న పురస్కారం -2026 ప్రదానం 

ఈతరం భారతం  హైదరాబాద్, జూలై 28 :

మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి 95 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ త్యాగరాయ గానసభలో యువ ఆర్ట్ థియేటర్స్ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కవి, రచయిత, పాత్రికేయులు డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ కు సినారె కళారత్న -2026 పురస్కారాన్ని అందజేశారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక భాషా సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని శ్రీనివాస్ అందుకున్నారు. సినారె పురస్కారం పొందిన శ్రీనివాస్ కు కార్యక్రమ అతిధులతో పాటు యువ ఆర్ట్స్ నిర్వాహకులు అభినందనలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top