EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మహేశ్వరం నియోజకవర్గం TRS పార్టీ ఇంచార్జిగా కోల శ్రీనివాస్ నియామకం

ఈతరం భారతం హైదరాబాద్, జూలై 28

తెలంగాణ రక్షణ సేన TRS పార్టీ వ్యవస్థాపక అధినేత్రి కల్వకుంట్ల కవిత మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బడంగ్‌పేట్ నివాసి కోల శ్రీనివాస్ కు మహేశ్వరం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కోల శ్రీనివాస్ బీసీ సామాజికవేత్త& తెలంగాణ ఉద్యమ నేత,30 సంవత్సరాల రాజకీయ అనుభవం.గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడు.తెలంగాణ MBC సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు.పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్.ప్రజల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు తీర్చే బహుజన బిడ్డ.పార్టీ నిర్మాణానికి పూర్తి సమయం కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కోల శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఇన్ని ఉద్యమాలు చేసిన, జెండా పట్టే కార్యకర్తలన్నీ చూసిన TRS పార్టీలోనే ఎమ్మెల్యే స్థాయి పదవి ఒక సాధారణ కార్యకర్తకు రావడం కవితక్క గారికే సాధ్య మన్నారు. జాతీయ పార్టీలలో ఇలాంటి పదవులు, నామినేటెడ్ పోస్టులు కార్యకర్తలకు రావు. ప్రాంతీయ పార్టీగా ఏర్పడ్డ TRS పార్టీ రాబోయే రోజుల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కల్వకుంట్ల కవితక్క కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని వివరించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అందరి పార్టీగా ఈరోజు ఆదరణ పొందుతున్న TRS పార్టీ – ఎక్కడ అన్యాయం ఉన్నా అక్కడ న్యాయం జరిగే వరకు పోరాడే పార్టీ” అని కోల శ్రీనివాస్  స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top