EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీ పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ ఆద్వర్యం లోఇంటింటా శ్రీమద్భగవద్గీత పంపిణీ

ఈతరం భారతం చౌటుప్పల్ జులై 29 ;

శ్రీ పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటాశ్రీమద్భగవద్గీత పంపిణీ కార్యక్రమాన్ని ప్రముఖ సాహితీ వేత్త బడుగు శ్రీరాములు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమాన్ని సంక్లిష్టంగా ఉన్న వేదాలను నాలుగు వేదాలుగా విభజించి విభజించి మహాభారత, శ్రీమద్ భాగవతం, మరియు 18 మహా పురాణాలను రచించి విశ్వ మానవాళికి వేగుచుక్క గా నిలిచిన శ్రీమద్ వ్యాసభగవానుడు జన్మించిన గురు పూర్ణిమ ను

పురస్కరించుకొని ఇంటింటా శ్రీమద్ భగవద్గీత పుస్తక ప్రసాదాన్ని వెయ్యి కుటుంబాలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు అధ్యక్షత వహించినఫౌండేషన్ చైర్మన్ శ పాలకుర్ల మురళి గౌడ్ మాట్లాడుతూ సత్యాన్ని, ఆధ్యాత్మిక ధర్మ జీవనాన్ని పాటించుటకు తప్పనిసరిగా శ్రీ భగవద్గీతను ప్రతినిత్యం పఠించాలని అన్నారు. శ్రీ భగవద్గీత మానవ జీవనయానానికి దీపస్తంభవని పేర్కొన్నారు. ఋషులు రూపొందించిన ధర్మమే ఈ విశ్వానికి ఆధారపీఠమని తెలిపారు.

కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు యువకులు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top