ఈతరం భారతం మంచిర్యాల, జూలై 30:
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గురువారం చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వర్షం కురుస్తున్న సమయంలో పుప్పాల హనుమాన్ వీధిలో రోడ్లపై, ఇళ్ల ముందు చిన్న చేపలు కనిపించడంతో ఒక్కసారిగా అక్కడ ఆసక్తికర వాతావరణం నెలకొంది.గురువారం ఉదయం వర్షం సమయంలో కాలనీలోని పలు ప్రాంతాల్లో చిన్న చేపలు కనిపించాయి. తొలుత వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురై చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో క్షణాల్లో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఇలాంటి ఘటనను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని పలువురు తెలిపారు.
రోడ్లపై కనిపించిన చేపలను ఏరుకునేందుకు చిన్నారులు, మహిళలు, యువకులు పోటీ పడ్డారు. కొందరు గొడుగులు, మరికొందరు బకెట్లు, సంచులు తీసుకుని చేపలను సేకరించారు. దీంతో కొద్దిసేపటికే ఆ ప్రాంతం సందడిగా మారింది.ఈ ఘటనను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. “చెన్నూరులో చేపల వర్షం”, “ఆకాశం నుంచి చేపలు పడ్డాయి” అనే శీర్షికలతో ఈ వీడియోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి















