ఈతరం భారతం హైదరాబాద్ జూలై 30 :
సాహితీ కళాసేవా సమితి(సాంస్కృతిక,సేవా సంస్థ)ఆధ్వర్యంలో గురుపౌర్ణమి నాడు జ్ఞానపీఠ్ డా॥ సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా,సినారె సాహితీ పురస్కారాలు – 2026 పురస్కార కార్యక్రమం హైదరాబాద్ నగరం నందు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ఖమ్మం నగరానికి చెందిన జర్నలిస్ట్ టీ. వెంకట్ కు ఉత్తమ జర్నలిస్ట్ మరియు రచయిత గా కమిటీ వారు ఎన్నుకొని సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు అలాగే తెలుగు రాష్ట్రాల నుండి ఆర్మీ,విద్య,సంగీతం,నృత్యం,రచనలు,కవితలు మొదలగు వాటిలో ప్రతిభను కనబరిచిన వారిని ఎన్నుకొని సాహితీ కళా సేవ సమితి,సాంస్కృతిక సేవ సంస్థ వ్యవస్థాపకులు స్వప్న కిషోర్ వారికి ఆత్మీయ అతిధుల చేతులు మీదుగా జ్ఞాపికలను అందజేశారు.
అవార్డు గ్రహీత వెంకట్ తనకు ఇంతటి గొప్ప అవార్డు రావడం అదృష్టం మరియు నా ప్రతిభకు దక్కిన గౌరవం గా భావిస్తూ ఎన్నుకున్న కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు.













