EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులలో చేరేందుకు  ఇక రెండు రోజులే గడవు

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 4

బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వుమెన్ స్టడీ సెంటర్లో 2026-27 సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులకు రెండు రోజులే ఉన్నందున ఈ చివరి అవకాశాన్ని మహిళా అభ్యర్థులు వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి మంగళవారం తెలిపారు. ఆగస్టు 7వ తేదీ కోర్సుల్లో చేరేందుకు చివరిరోజని అభ్యర్థులు గమనించాలని వారు సూచించారు.వివిధ డిగ్రీ కోర్సుల అడ్మిషన్లకు ఇంటెర్మీడియట్ పూర్తయిన లేక ఓపెన్ ఇంటర్ లేదా పాలీటెక్నిక్ మూడు సంవత్సరాల కోర్సు పూర్తయిన లేక ఐ .టి. ఐ . కోర్సు పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. డిగ్రీలో బీఏ(BA), బీకాం(BCom), బీఎస్సీ(B.sc), M.A. (Economics, History, Political Science,Public Administration, Sociology, Telugu, English,Hindi, Urdu Programmes are offered. Only Womens కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. అంతకు ముందు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారు,2nd year & 3rd year ట్యూషన్‌ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు కూడా చెల్లించవచ్చునని వారు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top