EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

7 న బెంగళూరులో జరిగే జాతీయ ఓబిసి మహాసభకు తరలి వెళ్లిన వెయ్యి మంది ఓబీసీ బి సి నాయకులు

ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 5;

ఈ నెల 7 న బెంగళూరులో జరిగే జాతీయ ఓబిసి మహాసభకు హైద్రాబాద్ నుండి దాదాపు వెయ్యి మంది ఓబీసీ బి సి నాయకులు పది బస్సులలో బయలుదేరి వెళ్లారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జా జూల శ్రీనివాస్ గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అమరవీరుల స్థూపం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారిలు మాట్లాడుతూ బెంగళూరులో జరిగే ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమం లో గుజ్జ కృష్ణ వైస్ చైర్మన్ కుల్కచర్ల శీను వాస్ ముదిరాజ్ జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్ రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ మహిళా అధ్యక్షురాలు మని మంజరి తారకేశ్వరి సెక్రెటరీ సిద్ధాంత శ్యామల అనంతో బ్రహ్మచారి జనగాం నరసింహాచారి వెంకటాచారి వరలక్ష్మి శోభ లింగం గౌడ్ భాస్కరు బండి గారి రాజు మీరు భాస్కర్ తండోప దండాలుగా బీ సి నాయకులు బెంగళూరు వెళ్లడం జరిగినది.

Related News

Select the Topic
Scroll to Top