ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 5 ;
విద్యార్థులకు లౌకిక ప్రజాతంత్ర శాస్త్రీయ ఆధునిక నైపుణ్యాలు పెంపొందించే విద్యా విధానం రూపొందించకుండా మత చాందస భావాలు, సాంఘిక దురాచారాలు, అసమానతలు కొనసాగే నూతన జాతీయ విద్య విధానాన్ని అమలుపరుస్తున్నారని అందువలన నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులంతా పోరాడాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు అన్నారు. హైదరాబాద్ కొత్తపేటలోని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవనంలో PDSU రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు రాష్ట్ర అధ్యక్షుడు కె.పవన్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా తరగతుల్లో ప్రస్తుత రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు నూతన జాతీయ విద్యా విధానం అనే అంశంపై ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యపై జాతీయ స్థూల ఆదాయంలో కనీసం రెండు శాతం కూడా విద్యపై ఖర్చుపెట్టడం లేదని లక్షలాదిమంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల నుండి డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారని మొత్తం విద్యను అభ్యసించే విద్యార్థుల్లో 35 నుండి 40% వరకు పాఠ్యాంశాలను అర్థం చేసుకునే స్థితిలో విద్యార్థులు లేరని అన్నారు ప్రభుత్వ విద్యాసంస్థలను ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను కళాశాలలను యూనివర్సిటీలను నెల కోల్పోయిందికే నూతన జాతీయ విద్యా విధానం మద్దతునిస్తోందనీ,పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్కాలర్షిప్స్ వంటి సంక్షేమ పథకాలను నూతన జాతీయ విద్యా విధానం వ్యతిరేకిస్తున్నదని వీటిని మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులకు ఇవ్వాలనే డిమాండ్స్ ను సమర్ధిస్తున్నదనీ అన్నారు. పురాణాలను మత చాందస భావాలను పెంచే విషయాలపై అధ్యయనాలు జరిగే విద్యా విధానం ప్రమాదకరమైనదనీ దాని స్థానంలో ప్రజాస్వామిక విలువలు కలిగిన విద్య కావాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈ పదేళ్ల కాలంలో దేశంలో 150 ప్రశ్న పత్రాలు లీకయ్యాయని ఫలితంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇది విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి తీవ్రమైన సంక్షోభాన్ని స్పష్టం చేస్తున్నదని తెలిపారు. దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత తాము చదువుకున్నటువంటి చదువుకు తగ్గట్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక మళ్ళీ వ్యవసాయ రంగం పై ఆధారపడే స్థితి నెలకొని ఉందని అన్నారు. అందుకనే ఆదానే వంటి పెట్టుబడిదారుల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా ప్రజలను మభ్యపెడుతూ తప్పుడు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ, సామాజిక సమస్యలకు విద్య మాత్రమే పరిష్కారం చూపుతుంది. అందుకే దేశీయ ప్రయోజనాలే ప్రాతిపదిక కలిగిన విద్యా విధానం కావాల్సిందేనని అన్నారు.
అదేవిధంగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ…. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వర్ణ వ్యవస్థ ఉన్న పురాణాల కాలం నుండే క్రింది వర్గాల విద్యార్థులు విద్యకు దూరంగా ఉన్నారని విద్యలో ఏ దేశం అయితే ఎక్కువ అభివృద్ధి సాధిస్తుందో ఆ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతుందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిని నియమించకుండా , నిధులు కేటాయించకుండా విద్యలో అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని పాలకులను ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో అసమానతల కారణంగా సంపన్న వర్గాల విద్యార్థులకే మంచి విద్య అందుతున్నదని పేద విద్యార్థులకు అందడం లేదని అన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలంటే కామన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో మతం , కులం పేరుతో చేసే రాజకీయాలను విద్యార్థులు వ్యతిరేకించాలని సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో PDSU జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.విజయ్ ఖన్నా, పి ఓ డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సరళ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎల్ గణేష్, PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎంపి వంశీ కుమార్, రాష్ట్ర నాయకులు ప్రవీణ్, యువజన, అనిల్, సైదులు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు















