ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 12:
రాష్ట్రంలో 3 కోట్ల 38 లక్షల ఓటర్లు ఉండగా అందులో నుండి 73 లక్షలను తొలగించడం అందులో 9,22,230 చనిపోయినవారు, 11,25,546 ఆబ్సెంట్/ఆన్ ట్రాసెబుల్, 45,18,961 పర్మనెంట్లీ షిఫ్టేడ్, 6,70,203 ఆల్రెడీ ఎన్రోల్డ్, 1.02.294 అదర్స్ అని తొలిగించడం అలాగే సుమారు 63లక్షల ఓటర్లు అనొమలీస్ లొ ఉండడం అసాధరమైన విషయం అని, ఈ ఓటర్లని లోతుగా పరిశీలించకుండా తొలగించకూడదని, రే వెరిఫికేషన్ చెయ్యాలని కోరడం జరిగినది.కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ 73 లక్షల ఓటర్ల వివరాలు బూత్ వారీగా ఇవ్వాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ సి. సుదర్శన్ రెడ్డి గారిని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, ఎస్ ఐ ఆర్ స్టేట్ కో ఆర్డినేటర్ గంప వేణుగోపాల్ తో కలిసి కోరడం జరిగినది.ఈ ఓటర్ల వివరాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి పరిశీలించాలని కోరడం జరుగుతుందనిటీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చెర్మెన్ పులిపాటి రాజేష్ కుమార్ తెలిపారు.















