EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 13

హైదరాబాద తెలంగాణ సినీ కళాకారుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, కళాకారుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (టీమా) ఆవిర్భవించింది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని టీవీ జేఏసీ కార్యాలయంలో టీమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా టీమా అధ్యక్షుడిగా బీఆర్ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కాకుమాను లూర్డు జ్యోతి, నిర్వాహక కార్యదర్శిగా మారేపల్లి లక్ష్మణ్ నేత బాధ్యతలు స్వీకరించారు. గౌరవ ముఖ్య సలహాదారులుగా జనార్దన్ రెడ్డి, నాగేష్ ముదిరాజ్, ప్రపుల్ రామిరెడ్డి వ్యవహరించనున్నారు. సినీ నిర్మాత ఆర్. శ్రీనివాస్, సినీ దర్శకులు రామ్ కుమార్, జానీ తదితరులు కార్యక్రమంలో పాల్గొని టీమా ఏర్పాటును స్వాగతించారు.

కళాకారుల కోసం సమిష్టి వేదిక

సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కళాకారులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించేందుకు ఒక బలమైన సమిష్టి వేదిక అవసరమనే ఉద్దేశంతో టీమాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కళాకారుల హక్కులు, గౌరవం, సంక్షేమం కోసం టీమా నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు.

సినిమా, టెలివిజన్, వెబ్ సిరీస్‌లు తదితర దృశ్య మాధ్యమాల్లో పనిచేస్తున్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, వారి సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం టీమా ప్రధాన లక్ష్యమని తెలిపారు.

నూతన కళాకారులకు ప్రోత్సాహం

తెలంగాణలో సినీ పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని టీమా ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న నూతన కళాకారులను ప్రోత్సహించడం, వారికి మార్గదర్శకత్వం అందించడం, సీనియర్ కళాకారుల అనుభవాన్ని యువతకు అందించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.కళాకారుల నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పరిశ్రమలోని ప్రముఖులతో సమన్వయం చేసుకుని కళాకారులకు తగిన అవకాశాలు అందేలా కృషి చేయనున్నట్లు వెల్లడించారు..

Related News

Select the Topic
Scroll to Top