EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి : డా. బూర నర్సయ్య గౌడ్

ఈతరం భారతం రంగారెడ్డి జిల్లా ఆగస్ట్ 12;

|రంగారెడ్డి జిల్లా |ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో ఒక పాఠశాల విద్యార్థి విద్యార్థినులతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నిర్వహించిన “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని తిరంగా ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డా. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, జాతీయ జెండా ప్రతి భారతీయుడి గౌరవానికి, దేశభక్తికి ప్రతీక అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

దేశ సమైక్యత, సార్వభౌమత్వం, అఖండతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. యువతలో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నారాయణ యాదవ్ , బిజెపి రాష్ట్ర నాయకులు నాయని సత్యనారాయణ , ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ పొట్టి శ్రీరాములు ,ఇబ్రహీంపట్నంమున్సిపాలిటీ,అధ్యక్షులు ముత్యాల మహేందర్ రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యులు ఆడెపు.రాఘవేంద్ర స్వామి , ఇబ్రహీంపట్నం మండల మాజీ అధ్యక్షులు దండే శ్రీశైలం , యువ మోర్చా జిల్లా నాయకులు సిద్ధం శివకుమార్ , బిజెపి సీనియర్ నాయకులు గణేష్ , ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ యువమోర్చా అధ్యక్షులు కంబాలపల్లి శశిధర్ రెడ్డి , మున్సిపాలిటీ ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు దాసు, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు కొండ్రు శ్రీనివాస్, మున్సిపాలిటీ కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం గోవర్ధన్, మున్సిపాలిటీ యువమోర్చా నాయకులు మడుపోజు.భరత్ చారి బిజెపి నాయకులు గొట్టం శ్రీశైలం ,బీజేపీ నాయకులు సురేష్ , కృష్ణ మరియు కార్యకర్తలు, ప్రజలు, యువత, మహిళలు, స్కూల్ విద్యార్థులు,పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top