EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రైవేట్ జూనియర్ కాలేజీల ధ్రువపత్రాలపై సమగ్ర విచారణ జరిపించాలి

ఈతరం భారతం హైదరాబాద్, ఆగస్టు 13:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు పర్మిషన్/గుర్తింపు, మరియు అఫిలియేషన్,రెన్యువల్ మంజూరు చేసే సమయంలో సమర్పిస్తున్న ఫైర్ ఎన్ ఓసి,బిల్డింగ్ స్టబిలిటీ సరిఫికెట్ అప్రూవ్డ్ ,బిల్డింగ్ ప్లాన్,శానిటేషన్,డ్రింకింగ్ వాటర్  తదితర ధ్రువపత్రాల నిజానిజాలను సమగ్రంగా పరిశీలించాలని PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది.

ఈ మేరకు PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. పవన్ కుమార్* , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గణేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కార్యదర్శి అభిలాష అభినవ్, ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యదర్శి వినతిపత్రాన్ని స్వీకరించి, సమస్యపై సానుకూలంగా స్పందించారని PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. పవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గణేష్ లు తెలిపారు.

వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించిన అనంతరం, ఈ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపిస్తామని కార్యదర్శి అభిలాష అభినవ్, హామీ ఇచ్చారు.ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కార్యదర్శి అభిలాష అభినవ్, ను కలిసి వారిలో కె. పవన్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ,కె. గణేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ బి. ఎం. వంశీ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  తెలంగాణ రాష్ట్ర కమిటీ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top