ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 15 , శనివారం:
గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు ఘణంగా జరిగాయి.మాజీ కార్పొరేట్ కంది శైలజ జండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా సంఘం ప్రత్యేక సలహదారులు బొమ్మ నరేందర్ నేత మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం మహిళా అధ్యక్షురాలు బల్ల గీత మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువు, ఉపాధి, సామాజిక సేవపై దృష్టి పెట్టాలని సూచించారు.యువత తలుచుకుంటే సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. ప్రతి యువకుడు బాధ్యతగా వ్యవహరిస్తూ దేశ ప్రగతిలో తన వంతు పాత్ర పోషించాలని కోరారు. కుల, మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్షి గోలి జనార్దన్, అల్లి గోవింద్,ముఖ్య అతిధులుగా పూల మారుతి,చిక్క దేవదాసు, అంకం శ్రీకాంత్, ధరణి మ్యాడం,మాయబ్రహ్మ, సంఘ సభ్యులు :పెండం సంతోష్,కడియాల బలరాం, దూస లక్ష్మి బాయి, కూరపాటి సుమలత, చింతకింది సుజాత, బొమ్మ శ్రీధర్, దాసి సునిల్, జక్క శ్రీహరి,దూస స్వదేశి తదితరులు పాల్గొన్నారు














