EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దేశవ్యాప్తంగా కొత్తగా మరో 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాల మీదుగా 2 సర్వీసులు..

ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్ట్ 15 శనివారం:

దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ఆమోదం లభించింది. వీటిలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రెండు రైళ్లు ఉన్నాయి. చర్లపల్లి-గోరఖ్‌పూర్, ధన్‌బాద్-కోయంబత్తూర్ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనున్నాయి. తక్కువ ఛార్జీలతో సుదూర ప్రయాణం చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు ఈ కొత్త అమృత్ భారత్ రైలు సర్వీసులు ఉపయోగపడే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 7 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ఆమోదం లభించింది. ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాలను కలుపుతూ ఈ కొత్త అమృత్ భారత్ రైళ్లు నడవనున్నాయి. తక్కువ ఛార్జీలతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి. కొత్తగా ఆమోదం పొందిన అమృత్ భారత్ రైళ్లలో చర్లపల్లి-గోరఖ్‌పూర్, గోరఖ్‌పూర్-బాంద్రా, గోరఖ్‌పూర్-ఢిల్లీ, సుబేదార్‌గంజ్-లోకమాన్య తిలక్ టెర్మినస్, ప్రయాగ్‌రాజ్-ఉద్నా, ప్రయాగ్‌రాజ్-లోకమాన్య తిలక్ టెర్మినస్, ధన్‌బాద్-కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ముఖ్యంగా 2 రైలు సర్వీసులు ప్రయోజనం కలిగించనున్నాయి. చర్లపల్లి-గోరఖ్‌పూర్ అమృత్ భారత్ తెలంగాణలో కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్హర్షా మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తుంది. ఈ మార్గం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఉత్తర భారత నగరాలకు రైలు కనెక్టివిటీని మెరుగుపరిచే అవకాశం ఉంది.

 

Related News

Select the Topic
Scroll to Top