ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 27 : గురువారం
చెప్పుడు మాటలు చేటు తెస్తాయని అది గమనించి మెదలు కోవాలని రక్షణ సేన అధ్యక్షురాలు కవితకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు బసవరాజు శ్రీనివాస్ సూచించారు. గురువారం ఆయన గాంధీ భవన్లో వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్య ప్రసాద్ తో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు.బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ పదవి విషయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత చేసిన వ్యాఖ్యలు సరికావని ఆయన పేర్కొన్నారు వ్యక్తుల ప్రాంతీయతను ముందుకు తెచ్చి ఒక సామాజిక వర్గాన్ని విభజించే ప్రయత్నం చేయడం తగదన్నారు.
తనను చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం వెనుక ఎలాంటి ప్రాంతీయ అంశం లేదని, బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం పనిచేయాలన్న ఉద్దేశంతోనే బాధ్యతలు అప్పగించారని తెలిపారు. తాను చెప్పుడు మాటల ద్వారా కవిత ఆరోపించి నట్టుగా ఆంధ్ర ప్రాంత వ్యక్తిని కాదని పూర్వికులు ఖమ్మం ప్రాంతావాసులని తాను నల్గొండ జిల్లా నడిగూడెంలో జన్మించానని విద్యాబ్యాసం మొత్తం తెలంగాణ లోనే సాగిందని ఆయన వివరించారు.పదవులు ప్రాంతంతో పాటు వారి సామర్థ్యం, సేవా భావం, సమాజానికి చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని ఇస్తారని ఆ విషయం ఎంపీ, ఎమ్మెల్సీ గా చేసిన కెసిఆర్ బిడ్డ కవితకు తెలవక పోవడం విచారకరమన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బ్రాహ్మణ సమాజం కూడా తన వంతు పాత్ర పోషించిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణలోని బ్రాహ్మణుల సంక్షేమం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు విద్యా అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.
బ్రాహ్మణ సమాజాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నీ పార్టీల చెందిన బ్రాహ్మణ బంధువులు తన పదవి ప్రమాణ కార్యక్రమం లో పాల్గొన్నారని ఆ విషయం రక్షణ సేన లోని బ్రాహ్మణ వ్యక్తులను అడగాలని ఆయన కవిత కు సూచించారు. పార్టీలు వ్యక్తులను పరిషత్ పట్టించుకోదని అది అందరికి ఉపయోగ పడుతుందని తెలిపారు ప్రాంతం గురించి ప్రశ్నించడం కంటే, బ్రాహ్మణుల కోసం నేను ఏం చేస్తానన్నదే ముఖ్యం. కవిత చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా నన్ను బాధించడమే కాకుండా, బ్రాహ్మణ సమాజాన్ని కూడా అవమానించేలా ఉన్నాయన్నారు తెలంగాణలో ఉన్న ప్రతి బ్రాహ్మణ కుటుంబం అభివృద్ధి కోసం పనిచేస్తానని ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేది లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు.ప్రాంతీయత పేరుతో సమాజంలో చిచ్చు పెట్టడం కంటే తెలంగాణ అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. బ్రాహ్మణ పరిషత్‌ను రాజకీయ వేదికగా కాకుండా సంక్షేమ వేదికగా బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.ఏ పార్టీ చేయని విదంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నెత్రుత్వంలో బ్రాహ్మణ జాతి అభివృద్ధి కి తోడ్పాటు నిస్తున్నారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు తో పాటు వివిధ శాఖల్లో బ్రాహ్మణ అధికారులు కీలక శాఖల్లో ఉన్నారని బస్వరాజ్ శ్రీనివాస్ తెలిపారు















