ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 27 గురువారం
2వ పి.ఆర్.సి.అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 డి.ఎ.ల విడుదల చేయాలని మొదలగు డిమాండ్లతోఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద జరిగిన తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ మరియు పెన్షనర్ల ధర్నా కు తెలంగాణ ఉద్యమకారుల కమిటీ మద్దతు ప్రకటించింది.ఈ సందర్బంగా ఉద్యమకారుల కమిటీ చెర్మెన్ బండి రమేష్ మాట్లాడుతూ ఈ.హెచ్.ఎస్ (ఉద్యోగుల ఆరోగ్య పథకం)ను సక్రమంగా, తక్షణమే అమలు చేయాలని పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రతి నెలా ₹2,000 కోట్లు విడుదల చేయాలని, సి.పి.ఎస్. సమస్యను పరిష్కరించాలని, ఉద్యోగుల యూనియన్లు మరియు అసోసియేషన్లకు గుర్తింపు ఇవ్వాలి.
ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాల ప్రయోజనాల దృష్ట్యా, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.















