ఈతరం భారతం తిరుపతి సెప్టెంబర్ 05 రిపోర్టర్ మనోజ్ కుమార్
___________________________________________________
తిరుపతి నగరపాలక సంస్థలో 66 వార్డుల పెంపుపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో కార్యాలయంలో తెలియజేయ వచ్చునని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ (వార్డుల పునర్విభజన) నియమ నిబంధనలు, 1996 G.O.Ms. No.570, MA & UD (Elec-2) Department, Dt. 06-11-1996 /2 మరియు కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఉత్తర్వులు Roc. No. 13032/2/2026/H1-1, తేదీ : 04-09-2026న 50 వార్డులను 66 వార్డులుగా విభజించుటకు నిర్ణయించడమైనదని తెలిపారు. ఇందుకు సంబందించిన సరిహద్దు వివరములతో కూడిన సమాచారమును తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయము, నగర పాలకసంస్థ పరిధిలో గల కలెక్టర్ వారి కార్యాలయము, రెవిన్యూ డివిజినల్ అధికారి కార్యాలయము, తహసిల్దార్ కార్యాలయము, సబ్ రిజిస్టార్ వారి కార్యాలయము, డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ నందు శనివారం పబ్లిష్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నివాసితులు ఈ ప్రిలిమినరి నోటిఫికేషన్ (ఫారం-1) ప్రచురణ తేది నుండి 7 రోజులలో (అనగా తేది: 11-09-2026 లోపల) ఏవైన సూచనలు లేదా అభ్యంతరములు ఉన్నయెడల కమిషనరు, నగర పాలక సంస్థ, తిరుపతి వారికి వ్రాతపూర్వకముగా సమర్పించవలయునని తెలియజేయడమైనది.















