EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక ముందడుగు

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 05 శనివారం

________________________________________

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ సంస్థ టీసీఎస్ ముందుకొచ్చింది. దీని ద్వారా రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెటనుంది. ఒక గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ ద్వారా 7 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా కేంద్రం హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. టీసీఎస్‌ హైపర్‌వాల్ట్‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. సచివాలయంలో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో హైపర్‌వాల్ట్‌, ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మొత్తం 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. 1 గిగా వాట్‌ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 7 వేల మంది ఉద్యోగవకాశాలు లభిస్తాయి.

ఒప్పందంపై సంతకాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టాటా ప్రాజెక్టుతో బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని, అందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో తన కల నిజమైందని సీఎం ఉద్ఘాటించారు. ఇంత పెద్ద మొత్తం పెట్టుబడి రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణకు ఇది గొప్ప శుభవార్త అని వ్యాఖ్యానించారు. దావోస్ సదస్సులో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను కలిసి పెట్టుబడులు పెట్టాలని కోరామని రేవంత్ తెలిపారు. టాటా, టీసీఎస్ , హైపర్ వాల్ట్ సంయుక్తంగా రూ.70 వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నాయని వెల్లడించారు.

Related News

Select the Topic
Scroll to Top