EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఆర్టీసీ – హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్ త్వరలో…

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 6 ఆదివారం

__________________________________________

ప్రయాణికులకు ఉమ్మడి పాస్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలోనే మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని అధికారులను ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు  ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్‌లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి చార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాస్‌ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు

మెట్రో రైల్లో సీఎస్ సంజయ్ జాజు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సాధారణ ప్రయాణికుడిగా మెట్రోలో సీఎస్ ప్రయాణించారు. బేగంపేట్ నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో ప్రయాణం చేశారు. మెట్రో సేవలు, ప్రయాణికుల సౌకర్యాలపై పరిశీలించారు. ఆయా స్టేషన్లలో సౌకర్యాలు, నిర్వహణపై అధికారులతో ఆరా తీశారు. ప్రయాణికుల రద్దీ, రైళ్ల నిర్వహణపై సీఎస్ పరిశీలించారు.

ప్రయాణికులకు అందుతున్న సేవల గురించి సీఎస్ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మెరుగైన, సురక్షిత ప్రజా రవాణాపై అధికారులతో చర్చించారు. మెట్రో సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరచాలని ఆదేశించారు. ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని సీఎస్ వివరించారు. సీఎస్ వెంట మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ ఎండీ అజిత్ రెడ్డి ఉన్నారు.

Related News

Select the Topic
Scroll to Top