ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 25
_________________________________
బిసి ఎస్సీ,ఎస్టీ, కాలేజి హాస్టళ్ళలలో సరిపోను సిబ్బంది లేక మరియు సీట్లు సరిపోక 10 లక్షల మంది విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమీక్షించి పరిస్థితులు మెరుగుపర్చాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమర్కను కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చలలో రాష్ట్ర బి.సి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బి.సి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ళ సతీష్, రాష్ట్ర బి.సి సంఘం అధ్యక్షులు సి. రాజేందర్ మరియు బి.సి నాయకులూ అంజి గౌడ్, నరేష్ గౌడ్, శివ కుమార్ యాదవ్, బలరాం, కె. వంశీ తదితరులు పాల్గొన్నారు.















