EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. ముగిసింది

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 25

___________________________________

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ముగిసింది. శుక్రవారం ఉదయం సుమారు 9.30 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర మొదలైంది.  వేకువ నుంచే పెద్ద సంఖ్యలో భక్తుల రాక మొదలైంది.శోభాయాత్ర మొదలయ్యే సమయానికి ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది.నగరానికి చెందినవారే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌లో మొదలైన ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా సాగింది.మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారీ క్రేన్ల సహాయంతో హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు.నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.

Related News

Select the Topic
Scroll to Top