ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 25
_______________________________
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమానికి పిలుపునిచ్చింది.జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోకపోతే అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ముంబై వేదికగా దేశవ్యాప్త ఆందోళనలను ప్రారంభిస్తామని సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేస్తూ.. “జ్ఞానేశ్ కుమార్ శనివారంలోగా రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 2న ముంబై నుంచి నిరసనలను ప్రారంభించి, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ ప్రజా ఉద్యమాన్ని విస్తరిస్తాం. ఈ గాంధీ జయంతి వేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం” అని హెచ్చరికలు జారీ చేశారు.















