EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మదురై పర్యటన లో ఊహించని పరిణామాలు

ఈతరం భారతం చెన్నై సెప్టెంబర్ 28 :

______________________________

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ మదురై పర్యటనలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘తై మామన్ గోల్డ్ రింగ్’ పథకాన్ని ప్రారంభించేందుకు సోమవారం ఆయన ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి విచ్చేయగా, అక్కడ జరిగిన తోపులాటలో 15 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో జన్మించే శిశువులకు 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని బహుకరించే ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభోత్సవం కోసం భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రిని చూసేందుకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) శ్రేణులు, స్థానికులు ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు, పనగల్ రోడ్డుకు ఇరువైపులా ఇనుప, వెదురు కంచెలను ఏర్పాటు చేశారు. అయితే, మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు సుమారు మూడు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. సరైన నీటి వసతి లేకపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి రాకతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తోపులాట మొదలైంది. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు వరుసగా స్పృహ కోల్పోయి కుప్పకూలారు.ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రతా వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపివేయడంతో, అస్వస్థతకు గురైన వారిని తరలించేందుకు అంబులెన్సులు రాకపోకలు సాగించడం కష్టతరమైందని వారు ఆరోపించారు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై, స్పృహ కోల్పోయిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, వెంటనే ఆసుపత్రిలోకి తరలించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాకతో సందడిగా మారాల్సిన వేదిక, జనం పడ్డ ఇబ్బందులతో కాసేపు గందరగోళంగా మారింది.

Related News

Select the Topic
Scroll to Top