EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రీ చార్జీలకు 30 రోజుల వ్యాలిడిటీ: టెలికాం కంపెనీలను ఆదేశించిన ట్రాయ్

ఈతరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 29:

___________________________________

మొబైల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. 30 రోజుల వ్యాలిదిటీతో రీఛార్జ్ ప్లాన్లు, అలాగే వాయిస్, మెసేజ్ 3 మాత్రమే ఉండే ప్లాన్లు అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. టెలికాం వినియోగదారుల సెక్యూరిటీ (13వ సవరణ) నిబంధనలు, 2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల ద్వారా వినియోగదారులకు ఎంతో లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. గతంలో నెలవారీ రీఛార్జ్ పేరుతో వినియోగదారులు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ సమస్య ఉండదని రాఘవ్ వడ్డా తెలిపారు. ట్రాయ్ కొత్త నిబంధనలతో 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ల ాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాలని ట్రాయ్ ని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ ప్లాన్లలో ఇన్కమింగ్ అవుట్గోయింగ్ సేవలు రెండూ అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, బడ్జెట్లో ఉండే మొబైల్ యూజర్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పరిమితమైన రీచార్జ్ ఎంపికలపై ప్రజల నుంచి వచ్చిన అందోళనలను తాను మార్చి 11న పార్లమెంట్ లో లేవనెత్తానని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వానికి, ట్రాయికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్మాణాత్మక రాజకీయాలకు ఇదొక గొప్ప నిదర్శనమని ఆయన అన్నారు.అందుబాటులోకి రావడంతో, ఇకపై వినియోగదారులు సంవత్సరానికి 13 సార్లు కాకుండా కేవలం 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top