ఈతరం భారతం ఖమ్మం అక్టోబర్ 1
___________________________
సమాచార హక్కు చట్టం సామాన్య పౌరుడికి వజ్రాయుధం వంటిదని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి.శ్రీనివాసరావు అన్నారు.గురువారంనాడు ఎస్ ఆర్ బి జిఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల లో ప్రిన్సిపాల్ డా.మొహ్మద్ జాకిరుల్లా అధ్యక్షతన జరిగిన సమాచార హక్కు చట్టం -స్వరూప స్వభావాలు అనే అంశంపై జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.చట్టాలు,చరిత్ర, గతం వర్తమానం భవిష్యత్తు గురించి విద్యార్థులుఅధ్యయనం చేయాలని సూచించారు.కళాచరిత్ర ను ఈనాటి విద్యార్థులు తెలుసుకోవాలని పేర్కొన్నారు శ్రీశ్రీ లాంటి కవులు సందర్శించిన కళాశాల లో చదువుతున్నామని సగర్వంగా నిలవాలని కోరారు.జవాబుదారితనం ఉండాలనే ఆలోచనతో ఈ చట్టం వచ్చిందని, పౌర సమాజానికి పారదర్శకత ఉండాలనే ఆకాంక్ష తో ఆర్టిఐ-2005 లో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారని తెలిపారు. విద్యార్థులు సామాజిక అవగాహన తోపాటు ,పౌరబాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించడం ముఖ్యమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలగురించి అవగాహన ఈకలిగిఉండటం అనివార్యమని వెల్లడించారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఏఎల్ ఎన్ శాస్త్రి, ఎగ్జామ్స్ కంట్రోలర్ డా.రమాసత్యవతి,పూర్వ విద్యార్థి వంజాకులలక్ష్మీ నారాయణ ,గెంటేలనారాయణరావు మనుమడు శ్రీనివాసరావు, అధ్యాపకులు బంగారా,డా.వైరవివర్థన్,డా.లక్ష్మణరావు,పి.నరసింహారావ, అజిత్, అప్పారావు కె.శ్రీనివాస్, వివిధ విభాగాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు















