EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్లాస్టిక్ నోట్లకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్

ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 6 :

_______________________________

దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కీలక అడుగు వేసింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రయోగాత్మకంగా ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం.ఈ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించినట్లు ఆర్బీఐ అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్  చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు మరింత మన్నికగా ఉండే అవకాశం ఉంది. దీంతో నోట్ల జీవితకాలం పెరగడంతో పాటు, తరచుగా దెబ్బతినే చిన్న విలువ గల నోట్ల సమస్యను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే 2012లోనూ ప్లాస్టిక్ నోట్లపై ప్రయోగాత్మకంగా ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును మరోసారి పరిశీలిస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top