ఈతరం భారతం హైదరాబాద్, అక్టోబర్ 9:
________________________________
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని విస్తరించేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరంతర క్రీడా, ఫిట్నెస్ ఉద్యమం ‘ఖేలో తెలంగాణ బంధన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాకింగ్, సైక్లింగ్తో పాటు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడా కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజలు నిత్యం వ్యాయామం చేయడంతో పాటు క్రీడల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం ‘ఖేలో తెలంగాణ బంధన్ ఫిట్నెస్ ఛాలెంజ్’లో భాగంగా తొమ్మిది మంది అధికారులకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు.
ఈ ఛాలెంజ్లో భాగస్వాములు కావాలని 1)హైదరాబాద్ జిల్లా కలెక్టర్ 2)మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ 3)డీసీపీ 4)ఏసీపి 5)సీఈఓ కంటోన్మెంట్ సికింద్రాబాద్ 6)డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ 7)ఆర్డీవో సికింద్రాబాద్ 8 డి ఎం అండ్ హెచ్ ఓ హైదరాబాద్ 9) డీఈవో హైదరాబాద్ తదితర అధికారులకు ఖేలో తెలంగాణ బందన్ ఛాలెంజ్ విసిరారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యువతలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు.రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ, క్రీడా బడ్జెట్ పెంపుతో పాటు వివిధ క్రీడా కార్యక్రమాలు, పోటీల నిర్వహణకు చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామానికి సమయం కేటాయించాలని, వాకింగ్, సైక్లింగ్, యోగా లేదా తమకు ఆసక్తి ఉన్న ఏదైనా క్రీడలో నిత్యం పాల్గొనాలని సూచించారు. ప్రజలు మైదానాలకు తరలివచ్చి క్రీడా కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
‘జాగో తెలంగాణ – భాగో తెలంగాణ – ఖేలో తెలంగాణ’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని, ఫిట్నెస్ ఛాలెంజ్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు చురుగ్గా పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే గణేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ అధికారి నందకిషోర్, SATG అధికారులు గోకుల్, కన్నం మధు, సురేష్ కాలేరు, జింఖానా గ్రౌండ్ సిబ్బంది, కోచ్లు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















