EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 6

ఇతర భారతం హైదరాబాద్ అక్టోబర్ 21 :

_______________________________

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా తయారీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 6 వరకు గడువు ఉంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. నమోదు ప్రక్రియపై అభ్యర్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆ తేదీలోపు డిగ్రీ లేదా దానికి సమానమైన డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు మాత్రమే ఓటరుగా నమోదు కావాలి. సంబంధిత యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ జారీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్, మార్కుల మెమో, ప్రొవిజినల్ ధ్రువపత్రం వంటివి దరఖాస్తు సమయంలో అవసరమవుతాయి.దరఖాస్తుదారులు ప్రస్తుతం తాను ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోనే నివసిస్తుండాలి. ఫారం-18 పూర్తి చేసేటప్పుడు అభ్యర్థులు నిబంధనల ప్రకారం వివరాలను పొందుపరచాలి. సర్టిఫికెట్లు అందుబాటులో లేని వారు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అర్హులైన పట్టభద్రులు గడువు ముగిసేలోపు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలి.

Related News

Select the Topic
Scroll to Top