EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం… పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం

ఇతను భారతం హైదరాబాద్ అక్టోబర్ 21:

________________________________

కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమని, ఈ పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు.విజయ దశమి పర్వదినం పురస్కరించుకొని ఆమె కాంగ్రేస్ పార్టీ నేతలు కార్యకర్తలకు శుభాకంకశాలు తెలిపారు..గాంధీ భవన్ లోని రంగ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం లో ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే లక్ష్యం.. పార్టీ అధిష్ఠానం నాపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానన్నారు.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, రాబోయే జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లోవిజయానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

పార్టీ అభివృద్ధి, ప్రజాసేవ, రాబోయే ఎన్నికల్లో విజయమే తన ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర, బలమైన ప్రజా పునాదులు ఉన్నాయని, దేశ నిర్మాణంలో పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆమె పేర్కొన్నారు. పార్టీని స్థాపించిన నాటి నుంచి ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

తన నియామకానికి సహకరించిన పార్టీ అధిష్ఠానానికి, శు భాకాంక్షలు తెలిపిన నాయకులకు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్పార్టీ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ, రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చూడాలన్న లక్ష్య సాధనకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి సమష్టి కృషి అవసరమని పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top