EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జియాగూడ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా సంబరాలు

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 22

_______________________________

;జియాగూడ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జియాగూడ కేశవస్వామినగర్ లో దసరా సంబరాలను కన్నుల పండువగా నిర్వహించారు. జియాగూడ ధార్మిక ఉత్సవ సమితి చైర్మన్ ఎమ్. కాంతిలాల్, అధ్యక్షుడు బి.శివకుమార్యాదవ్ల నేతృత్వంలో జరిగిన దసరా సంబరాల్లో భాగంగా రావణ దహనం నిర్వహించారు. శ్రీరాముడు.. హనుమంతుడి వేషధారణల్లోని చిన్నారులు రావణాసురుడి విగ్రహానికి నిప్పుపెట్టడం.. వేలాది మంది సందర్శకుల మధ్య రావణాసురుడి విగ్రహం దగ్ధమైన ఘట్టం కోలాహలంగా సాగింది. అనంతరం పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఉర్రూతలూగించాయి.

ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులకు, ఉత్తమ విద్యార్థులకు, క్రీడాకారులకు ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మొమెంటోలు బహూకరించారు. ఈ వేడుకల్లో భాజపా జియాగూడ డివిజన్ అధ్యక్షుడు జగదీష్యాదవ్, నేతలు దర్పల్లి నర్సింహులు, జల్లెల వెంకటేశ్, యాదగిరి, ఎమ్. సత్యనారాయణ, రమేష్ చౌగ్లే, రాజ్పోల్, కిషన్ఫామా, రాజ్కుమార్, శివాజీ, రమేష్యాదవ్, సోంపుయాదవ్, పి.శంకర్రావు, బాబూరావు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా స్థానిక కుల్సుంపురా ఏసీపీ వి తిరుపతి, ఇన్స్పెక్టర్ ఎ రాములు, ఎస్సైలు శ్వేత, నవీన్, నర్సింహ్మ తదితరుల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. I

Related News

Select the Topic
Scroll to Top