EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణలో మార్పులు

ఈ తరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 25:

__________________________________

సివిల్స్ పరీక్షల్లో బీసీ అభ్యర్థులు విజయం సాధించేలా కీలక మార్పులు జరిగాయి . దీనికి బీ సి సంక్షేమ శాఖ  పచ్చజెండా ఊపింది. ఎంపికైన అభ్యర్థులకు 3 సంవత్సరాల పాటు నిరంతరంగా కోచింగ్ అందజేస్తారు. వీరికి నెలకు 7000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. పుస్తకాల కోసం సంవత్సరానికి 10000 రూపాయల నగదు అందజేస్తారు.రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్ల పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 స్టడీ సర్కిళ్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫౌండేషన్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్న యువత గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, పోలీసు ఉద్యోగాలు సాధిస్తున్నారు. సివిల్స్ కొట్టాలనే కల మాత్రం నెరవేరడం లేదు.మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలను దాటడం కొందరికి సాధ్యం కావడం లేదు. ఆ తర్వాత వారికి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకంగా రిపీటర్స్ బ్యాచ్‌లను ప్రారంభించాలని కమిటీ సిఫార్సు చేసింది. స్టడీ సర్కిల్‌లో సీటు పొందిన అభ్యర్థి ఆ ఏడాది పరీక్ష రాయకపోతే తదుపరి సంవత్సరంలో రిపీటర్స్-1 బ్యాచ్‌లో అడ్మిషన్ ఇస్తారు. దీనికోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రిపీటర్స్-1 లో విఫలమైన వారికి రిపీటర్స్-2 లో మరో అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థులకు కఠినమైన శిక్షణ ఇస్తారు.

బీసీ స్టడీ సర్కిళ్లలో సంవత్సరానికి 2 సార్లు ఫౌండేషన్ కోచింగ్ ఇస్తారు. ప్రతీ స్టడీ సర్కిల్‌లో 100 సీట్లు అందుబాటులో ఉంటాయి. దాదాపు 125 రోజుల పాటు పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన అంశాలపై బోధన సాగుతుంది. ఫౌండేషన్ కోర్సులకు ఎంపికైన వారికి ప్రతినెలా 1500 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.సివిల్స్, ఫౌండేషన్ కోచింగ్ కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారు. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థుల సౌకర్యం కోసం 12 ఆన్‌లైన్ యూట్యూబ్ ఛానెళ్లను  ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని ప్రధాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. తరగతులు ముగిసిన తర్వాత విద్యార్థులు స్టడీ హాల్స్‌కు వెళుతున్నారు. దీనివల్ల వారిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈ ఇబ్బందిని తొలగించడానికి లైబ్రరీ వేళలను పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు లైబ్రరీని అందుబాటులోఉంచారు.

 

Related News

Select the Topic
Scroll to Top