ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 25
_______________________________
జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణకు, డంపింగ్ యార్డు సమస్యల నుండి శాశ్వత పరిష్కారం కోసం ఆదివారం హరిత ప్లాజాలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మేధావులు, పర్యావరణ వేత్తలు, డంపింగ్ యార్డు బాధితులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ మురళీ మనోహర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ జవహర్ నగర్ లో ప్రాణం పోయిన పర్లేదు అని జీవిస్తున్నారు.
రాంకీ డబ్బు, పలుకుబడితో కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయడం లేదు.కంచె చేను మేసినట్టు పాలకులు వ్యవహరిస్తున్నారు.ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోతుంది.జవహర్ నగర్ లో మొదట కదిలించిన సంఘటన.. కుక్కలు ఒక బాబును పీక్కొని తిన్నాయి రాంకీ సీ.ఎస్.ఆర్. డబ్బులు ఇక్కడ తాగునీరు రోడ్లు ప్రజలకు ఖర్చు చేయకుండా వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు- రాజ్యాంగం ను అపహాస్యం చేసే వారికి ఏం శిక్ష విధించాలి- సిఎం రేవంత్ ను మొదటి సారి కలిసింది జవహర్ నగర్ ప్రజల కోసమే.ప్రశ్నించే గొంతుక అధికారాన్ని చేపట్టావు.. దీనిని పరిష్కారం చేయాలి అని కోరితే.. మీరే మీటింగ్ పెట్టండి అని పెట్టించారు. కానీ చిత్తశుద్ధి లేదు. నాలుగు నెలలు దాటింది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.ఇంకో దగ్గర చెత్త వేయడానికి ప్రజలు ఒప్పుకోరు కాబట్టి జీరో పొల్యూషన్ టెక్నాలజీతో చెత్త డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
మహిళలకు గర్భ స్రావాలు అవుతున్నాయి.జవహర్ నగర్ చుట్టుపక్కల నరక కూపంగా మారింది.30 కిలోమీటర్ల రేడియస్ లో కాలుష్యం ఇబ్బంది ఉంది- ఈ ఏరియా పిల్లలను స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని స్కూల్స్ కూడా చేర్చుకోవడం లేదు.డంప్ యార్డు సమస్య గురించి పార్లమెంట్ లో మాట్లాడాను.. కేంద్ర మంత్రి కట్టర్ గారిని కలిసినం. ఢిల్లీలో కోట్ల టన్నుల చెత్తను రీసైకిల్ చేస్తున్నారు.చెత్తను ఎలక్ట్రిసిటీ జనరేషన్, బయోగ్యాస్, ఆర్గానిక్ మెన్యూర్ గా చేయవచ్చు.. అలాంటి ప్లాంట్స్ పెట్టండి.
చెత్త ఏరుకునే వాళ్లు మా దగ్గరికి వచ్చారు. రాంకీ సంస్థ చెత్త కూడా ఏరుకొనివ్వకుండా ఆ పని కూడా వాళ్లే చేస్తారట. డబ్బులు సంపాదించుకో కానీ ఇలా సంపాదించకు.27 నుండి పాదయాత్ర మొదలు పెడుతున్న.నేను రాజీపడే ప్రసక్తి లేదు.బాధితులు ఇంటికి ఒకరు వస్తారు అని భావించి పాదయాత్ర మొదలు పెడుతున్న.తప్పకుండా ప్రభుత్వం దిగివస్తుంది అని భావిస్తున్న.కేంద్రం నుండి నిధులు తెప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం.12 లక్షల కార్ల నుండి ఎంత పొల్యూషన్ వస్తుందో అంత పొల్యూషన్ దీనివల్ల వస్తుంది.
రేవంత్ రెడ్డి దీనిమీద రాజకీయం చేయవద్దు.
కాళేశ్వరం గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పిన కేసీఆర్ ను బోనులో పెట్టాలని తెలంగాణ రైతులను, ప్రజలను బోనులో పెట్టవద్దు. నీళ్లు ఎత్తిపోస్తే ఈ సమస్య వచ్చేది కాదు.670 టీఎంసీల నీళ్లు కిందకు వెళ్లిపోయాయి. మనకు 150 TMC నీళ్ళు అయితే సరిపోయేవి.పాలకులకు వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. గొప్ప పదవి కాదు, ఆ పదవికి ఎంత న్యాయం చేస్తున్నాం అనేది ముఖ్యం.రేవంత్ కాలగర్భంలో కలిసిపోతవా ? గుర్తుండిపోయేలా ఉంటావా నిర్ణయించుకో. ఇది ప్రభుత్వం చేయగలిగే పని.ఒక్క కిలో చెత్త జవహర్ నగర్ కు రానియవద్దు.. ఉన్న చెత్తను కూడా రీసైకిల్ చేయాలి డిమాండ్ చేసారు.















