ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 26 :
హైదరాబాద్‌లో తాగునీటిని వృథా చేసినందుకు ప్యారడైజ్ హోటల్‌కు జలమండలి రూ.20,000 జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు తనిఖీలు నిర్వహించగా హోటల్‌లో నీటి వృథాను గుర్తించారు. భవిష్యత్తులో నీటిని పొదుపుగా వాడాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు. నీటి వృథాకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని జలమండలి హెచ్చరించింది.















