EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆరెకటిక అభివృద్ధిప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 27:

________________________________

తెలంగాణ ఆరెకటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక

ఆరెకటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భూంపల్లి అశోక్ దాదా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగింది ఈ సమావేశానికి అతిథిగా పాండురంగ చారి ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ అధ్యక్షులు హాజరైనారు, ఉపాధ్యక్షులు నాగ శేషు పాలెం రమేష్ సభా అధ్యక్షత వహించారు, జె శ్రీనివాస్ జాయింట్ సెక్రెటరీ, కే ఎన్ శ్రీనివాస్, కె వెంకటేష్ ఉపాధ్యక్షులు, డి ధర్మేందర్, నరేష్ జి, జి రాజేష్, కే జాంగిర్, మొదలగు వారు హాజరైనారు.ఈ సందర్బంగా ఈ క్రింది తీర్మానాలను సమావేశం ఎక్డగ్రీవంగా ఆమోదించింది.

ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ వెంటనే ఇవ్వాలి జీవో తేవాలి..

వైన్స్ టెండర్లలో 30% రిజర్వేషన్ కల్పిస్తూ జీ ఓ తేవాలి..

బీసీ డి నుండి బిసిఏ హోదా కల్పిస్తూ జీవో తేవాలి..

మా మటన్ షాపులలో కరెంటు ఉచితంగా ఇవ్వాలి. మేకల మండిలను ఆధునికరించి మా ఆరె కటికలకు ఇవ్వాలి.ఆరెకటికలకు ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లలో పూర్తి హక్కు కల్పించాలి.

యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయలు ప్రభుత్వం కల్పిస్తూ జీవో తేవాలని సమావేశం డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో నూతనంగా రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా కేడి దినేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది, మరియు కె నందీశ్వర్ గారిని గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కామలేకర్ వనజాబాయిని, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా మోతికర్ శోభాయని, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎస్ సరస్వతి బాయ్ ని ఎన్నుకోవడం జరిగింది,

Related News

Select the Topic
Scroll to Top